![]() |

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో కిట్టి పార్టీ ఎపిసోడ్ మస్త్ ఎంటర్టైన్ చేసింది. ఇందులో సీనియర్ అండ్ జూనియర్ యాక్టర్స్ తో శ్రీముఖి సోషల్ మీడియాలో వచ్చిన రూమర్స్ మీద ఒక సెగ్మెంట్ చేసింది. ఎవరి మీద ఫన్నీగా, ఎవరి మీద సీరియస్ గా రూమర్స్ వచ్చాయో చూపించింది.
"భావనక్క నీ గురించి ఫస్ట్ రూమర్ వచ్చినప్పుడు దానికి నీ రియాక్షన్ ఏమిటి " అని శ్రీముఖి అడిగింది. "ఏంటి అది నా గురించా అని షాకవుతాను. ఒక సారి కమల్ హాసన్ గారు భావనని కొట్టారు ఎందుకు కొట్టారు ఆ సినిమాలో ఆ షాట్ లో నేను గబగబా రాలేకపోయాను అని చెప్పి రాశారు. నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసినప్పుడు ఆయన నిజంగానే నన్ను కొట్టారు. మహానది మూవీని కలకత్తాలోని రెడ్ లైట్ ఏరియాలో షూటింగ్ చేసే టైములో అది జరిగింది. నేను పరిగెత్తుకుంటూ రావాలి నేను రాలేదు జూనియర్ ఆర్టిస్ట్ జరగలేదు నేను ఆగిపోయాను. ఎందుకు రాలేదు అని అడిగారు వాళ్ళు పక్కకు జరగలేదు అంకుల్ అని చెప్పాను దాంతో గట్టిగా కొట్టారు. ఇండస్ట్రీకి రావడం నీ అదృష్టం నువ్వు ఆ అదృష్టంలో ఉన్నావు. నువ్వు ఆ అదృష్టాన్ని పోగొట్టుకోకు అంటూ ఆ షాట్ ఐపోయాక నన్ను ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకుని చెప్పారు. అది నా చిన్నప్పుడు జరిగింది. ఇంటర్వ్యూస్ టైములో అది చెప్పేసరికి దాన్ని అలా హెడ్ లైన్ గా వేశారు." అని చెప్పింది భావన.

"మీ గురించి ఒక పాజిటివ్ రూమర్ ఉంటే అదేంటో చూసేద్దాం" అంటూ చెప్పింది శ్రీముఖి. ఇంతకు అదేంటంటే "సీజన్ 10 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇస్తున్న భావన " అది బిగ్ బాస్ అంటూ శ్రీముఖి గట్టిగా అరిచి చెప్పింది. వెంటనే హరి "భావన గారు మనిద్దరం బిగ్ బాస్ హౌస్ లో కలుద్దాం " అన్నాడు.
"సరే భావనక్క బిగ్ బాస్ హౌస్ లోకి అవకాశం వస్తే వెళ్తావా " అని అడిగింది శ్రీముఖి. వెంటనే భావన "నేను వెళ్ళను . నేను ఫ్యామిలీని వదిలి ఉండలేను. ఒకవేళ ఫారెన్ కంట్రీస్ కి ఏదైనా షోస్ కి వెళ్ళాలి అన్నపుడు కనీసం వీడియో కాల్స్ అన్నా చేసుకుని మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. కానీ బిగ్ బాస్ హౌస్ లో ఆ ఆప్షన్ ఉండదు. ఎన్ని రోజులు ఉంటామో ఎలా ఉంటామో ఏమీ తెలీదు. " అని చెప్పింది భావన . వెంటనే హరి. "ఒక పని చేద్దాం భావనా గారు వెళ్లి ఫస్ట్ వీక్ లో వచ్చేద్దాం " అన్నాడు. "సరే ఒక టు వీక్స్ అనే డ్యూరేషన్ ఇస్తే" అని శ్రీముఖి మళ్ళీ అడిగింది. "వెళ్తాను అన్న వాళ్ళనేమో అడగరు. ఆవిడ వెళ్ళను అంటుంటే ఒక వారమైన ఉంటావా రెండు వారాలైతే ఉంటావా " అని అడుగుతున్నారు అంటూ హరి ఫీలైపోయాడు. "అసలు నువ్వెందుకు వెళ్తావ్ రా టాలెంట్ ఉన్నవాళ్లకు ఆ షో ఆగు నువ్వు " అని శ్రీముఖి ఫైర్ అయ్యింది.
![]() |